Thursday, May 20, 2010

నేను ఆంధ్ర వాడినా ?? తెలంగాణా వాడినా ??

ఇప్పటి పరి బాషలో చెప్పాలంటే అమ్మది ఆంధ్ర , నానది తెలంగాణా క్రిందకి వస్తది . కాని మా ఊరులో ఖమ్మం , కృష్ణ రెండు జిల్లాల పవర్ వాడతారు .నానది తెలంగాణా అని నన్ను తెలంగాణా అనుకుంటే మా నాన నానది ఆంద్ర . మరి అంతకు ముందా నాకు తెలియదు . అసలు సంగతి ఏంటంటే నన్ను నా ఆంధ్ర స్నేహితులు నువ్వు తెలంగాణా వాడివిరా అంటారు . మరి నా తెలంగాణా స్నేహితులు ఊరుకుంటారా ఆహా లేదే , నువ్వు అటువాడివే అంటారు .

అందుకే ఇద్దరకి చెప్పేది ఏంటంటే

నేను ఆంధ్ర వాడిని కాదు
తెలంగాణా వాడిని కాదు .
...............................
మరి....... అసలు సిసలు తెలుగు వాడిని .
గర్వంగా ,సగర్వంగా , మీసం మెలి వేసి , తొడ కొట్టి , చిందేసి , కేకేసి ,రంకేసి చెపుతున్న అవును నేను 100 శాతం తెలుగు వాడిని .

అందుకే నా ఈ తెలుగు రాజ్యం . నా రాజ్యం లో అందరు మంచి వారే .

ఇట్లు
తెలుగు పౌరుడు

2 comments:

  1. పాట చాలా బాగుంది. మీరు, మేము కచ్చితంగా తెలుగు వారమే

    ReplyDelete
  2. ధన్యవాదములు అండి

    ReplyDelete