మొఖం మీద నీళ్ళు పడగానే కళ్ళు తెరిచి చూసాను ,ఎదురగా నాన నవ్వుతూ కనిపించాడు . ఇప్పటికి ఎన్ని Years అయినా కాని నాన నా మొఖం మీద నీళ్ళు కొట్టి గుడ్డతో తుడుస్తా వుంటాడు ప్రేమతో . నిద్దర బాగా పట్టిందా అడిగాడు , నవ్వి ఊరుకున్నా . ఆకలి ఏమన్నా వేస్తున్నదా అని నా పొట్టలోకి తొంగి చూసాడు . పొట్ట Full గానే ఉందే అన్నాడు .అంతలో మా అమ్మ బుజం మీద Bag తో ఊపుకుంటూ వచ్చింది , రాగానే నన్ను ఒక ముద్దు పెట్టుకొని బయలు దేరదామా కన్నా అని అడిగింది . అమ్మా,నానా , నేను Public Service చేస్తాము . అందుకు డబ్బులు వస్తాయి అనుకోండి అది వేరే విషయం . ఆ రోజు వాతావరణం ఆహ్లాద కరంగా వున్నది . అంతలోనే జనం అంతా మా దగ్గరకు వచ్చారు . సరే అని చెప్పి నాన నా చేయి పట్టుకున్నాడు నాకు అంత వయస్సు వున్నా , నాన కన్నా నేను చాలా పెద్దగ వున్నా కాని . జనం కూడా మాతో వస్తున్నారు . అందరం ఆనందగా బయలు దేరాము .
అలా కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక గుంపు, గొడవ గొడవగా వున్నది . షాప్ లు అన్ని మూస్తున్నారు . కొంతమంది కుర్ర వాళ్ళు కర్రలు పట్టుకొని షాప్ లని మూయిస్తున్నారు . అద్దాలు పగల కొడుతున్నారు ,అరుస్తున్నారు , గోల పెడుతున్నారు , మరలా ఏదో గొడవ అనుకుంట . నానకి బయం వేసింది . నన్ను ,అమ్మని , మాతో వున్న జనాలను తీసుకొని వేరే మార్గం వైపు వెళదాము అనుకున్నాడు . మాతో అంత మంది జనం వున్న , నలుగురిని అలా చూడగానే అందరికి బయం వేసింది . తోందరగా పదండి లేకపోతే మన వైపు వస్తారు అన్నాడు ఒక అతను బయంగా . కాని అంతలోకే జరగని ఘోరం జరింగింది . మమ్మలిని చూసారు వాళ్ళు . అక్కడ వున్నారు పదందిరా అని గట్టిగా అరిచాడు వాళ్ళలో ఒకడు .వాళ్ళు కర్రలు , రాడ్ లు పట్టుకొని మా వైపు రావటం మొదలు పెట్టారు .
అప్పటిదాక మా తో వున్న జనం ఒక్క సారి పరగు లంకించుకున్నారు . ఎటు వాడు అటే వెళ్ళాడు . నేను , అమ్మ , నాన నే మిగిలాము . మమ్మల్ని చూసి వెకిలిగా నవ్వాడు ఒకడు . నాన వాళ్ళను ప్రాధేయ పడ్డాడు ఏమి చేయ వద్దని . వాళ్ళలో ఒకడు మరీ నాటుగా వున్నాడు . నానని బూతులు తిట్టటం మొదలు వేసాడు . నానకి బయం వేసింది . అప్పటిదాకా నన్ను పట్టుకున్న చెయ్యి చిన్నగా వదలటం మొదలు పెట్టాడు . ఎవడా వాడు అని నేను చూసాను . ఉష్ వాడు నాతో రోజు వచ్చే వాడే . నాకు బాగా తెలిసిన వాడే , వాడికి మేము తెలుసు . అయినా కూడా బాగా మందు పోయించి నట్లు వున్నారు . ఊగి పోతున్నాడు . ఒక్క సారి నాన్నను డొక్కలో తన్నాడు . నాన కళ్ళ వెంట నీళ్ళు సుడులు తిరిగినవి , అమ్మ అప్పటికే బోరున ఏడుస్తున్నది .
ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రాయి వచ్చి నా కళ్ళ జోడుకు తగిలింది . కళ్ళ జోడు అద్దం ముక్కలు ముక్కలు అయింది . ఇంకొకడు వచ్చి రాడ్ తో నా తల మీద గట్టిగా కొట్టాడు . వాడి వైపు చూసాను . వాడికి ఒకప్పుడు నేను హెల్ప్ చేసిన వాడినే . నా మీద ఎందుకో వాడికి అంత కక్ష .నన్ను చూసి అందరు వెర్రి నవ్వులు నవ్వటం మొదలు పెట్టారు . అందరిని చూడటం కష్టంగా వున్నది కళ్ళ జోడు పగలటం వల్లన , కాని అక్కడ వున్న వాళ్ళ అందరికి ఒక సారి కాకపోతే మరొక సారి హెల్ప్ చేసిన వాడినే నేను . అంతలో మరో రాయి వచ్చింది . నా కంటికి సూటిగా తగిలింది . కనుగ్రుడ్డు పగిలి పోయింది , రక్తం కారటం మొదలు అయింది . అర్ధం అయింది నన్ను వదలరు అని . ఇంకొకడు డొక్కలో పొడిచాడు , వీపు మీద ఒకడు అన్ని విరిగి పోతున్నవి . ఏమి చెయ్యలేక నాన అమ్మ ఏడుస్తున్నారు . వాళ్ళ పైశాచిక ఆనందము చూసి నవ్వు వచ్చింది అంత బాధలో కూడా .కాళ్ళలో శూలాలతో పొడిచాడు ఇంకొకడు . నా body అంత నుజ్జు నుజ్జు అయింది . మీద పది కొట్టే వాడు కోడతేనే వున్నాడు .అలిసి పొయ్యారు అనుకుంట 15 ను నిమిషాల తరువాత ఆగారు . అమ్మా , నాన్న కళ్ళలో ఆశ .... ' ఇప్పటికైనా వదలుతారు వాళ్ళ అబ్బాయిని '.... అని.
పదరా అన్నాడు వాళ్ళలో ఒకడు . సరే అని తిరిగి వెళ్ళటం పొదలు పెట్టారు మమ్మల్ని వదిలి . అలా ఒక్క నిమిషం అయిందో లేదో మరలా వెనక్కి ఉరికి వచ్చారు . వాళ్ళ చేతిలో
can మెరుస్తూ కనిపించిది . అందులో ఏమి ఉన్నదో తెలుసు , మూత తీసాడు , నా మీద పొయ్యటం మొదలు పెట్టాడు . పెట్రోల్ వాసన గుప్పు మన్నది . అరేయ్ ఇటువైపు పొయ్యర ఇటు తడవాల అన్నాడు ఒకడు . ఒకడు ఏకంగా నా నెత్తిన పోసాడు . అగ్గి పుల్ల గీసాడు ఇంకొకడు . ఎంత దారుణం బతికి ఉండగానే నిప్పు పెడుతున్నారు . అమ్మ నాన నన్ను ఒకాసారి కడసారి చూసుకున్నారు . మండుతున్న అగ్గిపుల్ల నా తల మీద వేసారు . బోడి మొత్తం తగల పడటం మొదలు అయింది . ముందుగ నా కాళ్ళు పేలి పోయినవి ఆ తరువాత తల , నా కడుపు అలా కాలుతున్న నన్ను చూసి చుట్టూ చేరి పాటలు పాడుతూ , ఈలలు వేస్తూ రాక్షస ఆనందాన్ని అనుబవిస్తున్నారు .మత్తు దిగింది అనుకుంట ఇంక బయలు దేరారు . అప్పటికే నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసి పోయినవి . ఎంత దారుణం వాళ్ళు వాళ్ళు చేసుకున్న దుర్మర్గాలకి ఇంత సేవ చేసిన నన్ను బలి కొన్నారు .
ఇంతకి నేనెవరో తెలుసా ఎప్పుడు ఏ గొడవలు జరిగిన ముందుగా effect అయ్యే ఒక R.T.C Bus ని . ప్రజలకు సేవ చేసే ఒక దౌ ర్భాగ్యుడిని .
Dear All :- I Started a website for telugupeople , it is
telugukingdom.net
( ఇక్కడ అందరు మంచివారే )
ఇట్లు
బెడ్డు
చంక నాకి పోతావురా అన్నారు . అసలు విషయం ఏమిటంటే
చంక నాకి పొయ్యాక కాని నాకు తెలియలేదు చంక నాకి పొయ్యాను అని .
Subscribe to:
Post Comments (Atom)
అర్యా .....ఇది మీ తొలి ప్రయత్నం అని , మీ తాపత్రయం చెప్పకనె చెపుతుంది.కాస్త అక్షర దోషాలు సరి చూసుకోండి .( 'దౌర్భాగ్యం ' ) మాట్లాడేటప్పుడు మొహంలో ' హావ భావాలు ' యెలాగో ... రాతలో కూడా అవసరమే !
ReplyDeleteఅమ్మనాన్న మొహం లో ఆశ ఇప్పటికైనా వదలుతారు వాళ్ళ అబ్బాయిని అని. దీనిని ఇలా రాస్తె బాగుంటుంది.
అమ్మా , నాన్న కళ్ళలో ఆశ .... ' ఇప్పటికైనా వదలుతారు వాళ్ళ అబ్బాయిని '.... అని.
అక్షర దోషాలు మినహాయిస్తే తొలి ప్రయత్నం చాలా బాగా వ్రాసారు. చెప్పాల్సిన విషయం సరిగా చెప్పారు.. Keep it up!
ReplyDeleteRemove word verification please!!
క్షమించాలి మూర్తి గారు . మీరు అన్నట్లు ఇదే మొదటి సారి నేను తెలుగు బ్లాగ్ వ్రాయటం.. . మీరు చెప్పిన విషయాలను సరి దిద్దుకున్నాను .
ReplyDeleteనాకు కొంచెం ఒత్తుల బెడద ఉన్నది , దానితో కొంచెం ఇబ్బంది అవుతున్నది . ఇంకా పెద్ద అరాచకం ఏమిటంటే నండి నేనే తెలుగు బాగా మాట్లాడతాను , వ్రాస్తాను అని నా స్నేహితులు అంటారు :) ఎంత ఘోరం .....
భవదీయుడు
కిరణ్
రాజ్ గారు ధన్యవాదములు . మీరు చెప్పినట్లే word verification తీసివేసాను
ReplyDeleteTelugu గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.