అది ఇయర్ 3000 .... రాకెట్ లలో జనాలు తిరుగుతున్నారు .... ఆకాశములో ఎక్కడ చూసిన రాకెట్ల రొద.. . భారత దేశంలో ఒక ప్రాంతం , ఒక పెద్ద మైదానం .... దాదాపుగా కోటి మంది కూర్చోటానికి కష్ట పడి తయారు చేసిన మైదానం... . అది కూడా జనం వచ్చి వాళ్ళ వాళ్ళ రాకెట్లలో అక్కడే గాలిలో పార్క్ చేసి కూర్చోవచ్చు . ఆ రోజు అక్కడ కోటి మంది వున్నారు . విశేషం ఏమిటంటే ఆ రోజు రాకెట్ల రేస్ జరుగుతున్నది . అది కూడా 2 ప్రధాన టీమ్స్ మధ్య . అందులో ఒక రాకెట్ మీద తెలుగు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి వున్నది . ఇంకొక రాకెట్ మీద తమిళ్ అని రాసి వున్నది . పెద్ద పెద్ద TV లు అమర్చారు జనం చూడటానికి . పోటి రసవత్తరంగా ఉండ పోతున్నది . భారత దేశంలోనే సాంకేతికంగా , ఇంకా అన్ని విదాలుగా ముందు వున్న జనం మాట్లాడే భాషలు ఈ రెండు . అలాంటి వాటి మధ్య పోటి మరి . అది కూడా ఇయర్ ౩౦౦౦ లో చూడండి ఎంత రసవత్తరంగా ఉండ పోతున్నదో . పోటి ఏమిటంటే ఎవరు ముందు వెళ్లి లక లక గ్రహం మీద ( లక లక గ్రహం మీకు తెలియక పోతే అది 2500 లో కనుకున్నారు ) వున్న కాజల్ అగర్వాల్ ని, అన్షుకని తీసుకొని వస్తారో వాళ్ళు గెలిచినట్లు( అప్పటి దాక వాళ్ళు బతికి వుంటరా అని అడగ వద్దు ) .
టైం దగ్గర పడుతున్నది నిముషాలు కౌంట్ చేస్తున్నారు , పిల్లలు వాళ్ళ వాళ్ళ చిన్న చిన్నరాకెట్ లలో వచ్చి కేరింతలు కొడుతున్నారు . పక్కనే పెద్ద వాళ్ళు వాళ్ళ రాకెట్లలో అరుపులు కేకలు పెడుతున్నారు పిల్లల లాగా . అంతలో ఇద్దరు తెలుగు యువకులు వచ్చారు , జనం అంతా పెద్దగా చప్పట్లు కొట్టి సందడి చేసారు వాళ్ళని చూసి . వాళ్ళ ఇద్దరు వచ్చి షేక్ హాండ్స్ ఇచ్చుకున్నారు . మన తెలుగు రాజ్యం నుండి వాళ్ళిద్దరూ ఆ పోటికి సెలెక్ట్ అయ్యారు . కాని అదే ఫస్ట్ టైం వాళ్ళు చూసుకోవటం . ఒకళ్ళకి ఒక్కళ్ళు హాయ్ చెప్పుకున్నారు . అక్కడ వున్న తెలుగు వారు గోలలు ఈలలతో మంచి సందడి చేసారు వీళ్ళను చూసి . యువకులు వాళ్ళతో చేతులు కలపటానికి ముందు వగుతున్నారు రాకెట్లలో నుండి, ఇక అంతలో ఇద్దరు తమిళ్ యువకులు కూడా వచ్చారు , వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనుకుంట కలిసి వచ్చారు . మాచా మాచా నో మచ్చా మచ్చానో అని మాటలాడుకుంటున్నారు. అక్కడ ఉన్న తమిళ్ వారు కేరింతలు కొట్టారు , బలూన్స్ ఎగిరేసారు . పూనకం వచ్చిన వాళ్ళలాగా హ్యాపీగా వూగిపోయ్యారు .
పోటీదారులు ఇద్దరు రాకెట్ లు ఎక్కారు . పోటి మొదలుకాబోతున్నది . క్షణాలు కౌంట్ చేస్తున్నారు ...... రెడీ .........వన్ .......టు..............త్రీ ...........గో ............ రెండు రాకెట్ లు జూమ్ అంటూ బయలు దేరినవి . అది కాజల్ అగర్వాల్ , అన్షుక ల కన్నా బాగా గౌరవానికి సంబందించిన పోరాటం , ఎవరు గెలుస్తారో అని జనం అంతా Anxiety గా , exciting గా , నరాలు బిగపట్టి ఉన్నారు .జూమ్ అంటూ రాకెట్ లు రెండు గగన తలం లో దూసుకు పోతున్నవి . టి. వి లను కళ్ళు అప్పగించి చూస్తున్నారు . కొంతమంది అప్పుడు వున్న 6th sense technology వాడి చూస్తున్నారు . పోటి మొత్తం 20 నిముషాలు తీసుకుంటుంది అంతే . ఇక్కడ ఒక మాట చెప్పాలి తెలుగు యువకులు ఇద్దరు తమిళ్ వారికన్నా దృడంగా ఉన్నారు , అంతే కాదు మన వాళ్ళిద్దరూ టూ మచ్ గా technology తెలిసిన వాళ్ళు , ఇంతకు ముందు ఒంటరిగా పోరాడి అనేక బహుమతులు పొందిన వాళ్ళు .
5 నిముషాలు అయినవి తెలుగు రాకెట్ దూసుకు పోతున్నది , రెండు రాకెట్ల మధ్యన దూరం పెరుగుతున్నది . ఇంకొన్ని నిముషాలు గడించినవి తమిళ్ రాకెట్ కన్నా తెలుగు రాకెట్ లక్ష మైళ్ళ ముందు వుంది . . క్రింద తెలుగు జనం కేకలు పెడుతున్నారు . మరీ చాలా ముందు వున్నాము కదా . అంతలో ........
తరువాతి బాగం వచ్చే వారం లో
Still not joined , please join telugukingdom.net and support Telugu and Telugu community
Features
1) Word Wide Presence - Based on your Village , Town, Mandal , District and City people's world wide locations and their where abouts . Yes I am not joking We listed 30,000 Villages , 1500 (City's , Towns
and Mandals) of AndhraPradesh . Check for your village .
2) Track your interesting place for the Telugu people
3) Contact them if you need any help
4) Location based classifieds and eCoupons
5) Fun stuff for kids
6) last but not least forums
చంక నాకి పోతావురా అన్నారు . అసలు విషయం ఏమిటంటే
చంక నాకి పొయ్యాక కాని నాకు తెలియలేదు చంక నాకి పొయ్యాను అని .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment