తెలుగు రాకెట్ వేగం తగ్గటం మొదలు అయింది . క్రమేపి తగ్గుతూ పోతున్నది . క్రింద పోటీని చూసే తెలుగు వారికి భయం పట్టుకున్నది , ఎందుకు వేగం తగ్గిందో అర్ధం కాక వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవటం మొదలు పెట్టారు . అన్ని కంప్యూటర్స్ చూస్తున్నారు రాకెట్ లో ఏమన్నా టెక్నికల్ సమస్య వచ్చిందా అని , కాని అదేమీ లేదు . పోటి కాబట్టి లోపల ఉన్న వాళ్ళకి ఎటు వంటి సలహాలు ఇవ్వరాదు బయట నుండి . లోపల ఎమవుతున్నదో కూడా బయటకు తెలియ రావటం లేదు .తమిళ్ రాకెట్ అదే వేగం తో దూసుకు పోతున్నది . రెండింటి మధ్య దూరం తగ్గింది .అప్పటిదాకా మౌనంగా క్రింద వున్న తమిళ్ వారు కేరింతలు, కేకలు పెట్టటం మొదలు పెట్టారు . తమిళ్ రాకెట్ ఇంకా వేగం పుంజుకోవటం మొదలు పెట్టింది . తెలుగు రాకెట్ పరిస్తితి దరిద్రంగా తయారు అవునుతున్నది . ఇంకా వేగం తగ్గితే ఏ రాకెట్ అయినా ఏమవుతున్నది అండి అది పేలి పోతుంది . ఇంకా కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉన్నది . తమిళ్ వారి రాకెట్ ముందు దూసుకు పోయింది . క్రింద ఉన్న తమిళ్ళు పులుల్లాగా డాన్సు చేయటం మొదలు పెట్టారు . తెలుగు వారికి అసలు విషయం అర్ధం కాలేదు , ఎందుకు అలా అవుతున్నదో . తలతీసేసి నట్లు అవుతున్నది . రాకెట్ లో ఉన్న మన వాళ్ళు పెద్ద పుడింగులు టెక్నాలజీ లో , అందులోను నవ యువకులు దృడంగా ఉన్నవారు . మరి ఎందుకు ఇలా అవుతున్నది ...? మనం ఏమి అనుకున్నా జరగక జరిగేది మానదు .కాకపోతే ఏది కాకూడదు అనుకున్నామో అదే అయింది రాకెట్ వేగం పూర్తిగా తగ్గి పోయి , ఒక పెద్ద విస్పోటనం సంబవించింది . అంతా అయిపొయింది మన వాళ్ళు ఆ విస్పోటనంలో కాలి బూడిద అయ్యారు . ఎంతో జీవితం , అదీ అద్బుతమయిన జీవితం ఉన్న రెండు ప్రాణాలు గాలిలో కలిసి పోయినవి .

చేసేది ఏమి లేదు మనకు . తమిళ్ వారు మాత్రం అక్కడకు వెళ్లి కాజల్ అగర్వాల్ ని, అన్షుకని తీసుకొని క్రిందకు వచ్చారు . వారంతా పెద్ద ఎత్తున పండగ జరుపుకుంటున్నారు . ఏదో మోఖమాటానికి మన వాళ్ళ దగ్గరకి వచ్చి అయ్యో పావం అని తమిళ్లో అని వెళ్లి పొయ్యారు ఎంచెక్క ఎంజాయ్ చెయ్యటానికి .

నిజానికి జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు కాని తెల్లారి ముక్యమైన మూడు తెలుగు వార్తః పత్రికల్లో ఈ విధంగా వార్తలు వచ్చినవి .ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా
౧) టెక్నికల్ ప్రొబ్లెం వల్ల రెండు నిండు జీవితాలు బలి
౨) ఇంత జరగటానికి కారణం మొదటి వాడా?
౩) రెండవ వాడి వల్లే ఇంత జరిగిందా ? CBI ఎంక్వయిరీ

కాని అసలు జరిగింది ఏమి లేదు చిన్న విషయం . మొదటి వాడు ఒక చిన్న కూని రాగం తీసాడు . అది వాళ్ళ ప్రాణాల మీదకు తెచ్చింది . పాట ప్రాణాల మీదకు తేవటం ఏంటా అని ఆలోచిస్తున్నారా . అక్షరాలా జరిగింది అదే ! అసలు జరిగింది ఏంటయ్యా అంటే

తెలుగు వారి రాకెట్ లో ఇద్దరూ మంచి ఉషారుగా ఉన్నారు రాకెట్ బాగా నడుపుతున్నారు . ఆ ఆనందములో మొదటి వాడు

మొదటి వాడు :- ఆ! ఆ! ఆ ! ( ఒక పాట అందుకున్నాడు )
రెండవ వాడు :- ఏంటి ఆ పాట పాడుతున్నావు . అది ఆ సినిమా లో ది కదూ అవునా ? నువ్వు వాడి కి అభిమానివా ?
మొదటి వాడు :- ఆ అవును అని కొంచెం బిగ్గరగా పాడటం మొదలు పెట్టాడు
రెండవ వాడు :- ( వీడు వాడికి అభిమానా ఛీ ఛీ , వేగం కొంచెం తగ్గింది , వీడేనే పాడేది నేను పాడతాను అనుకోని వేరే పాట అందుకున్నాడు అదీ పెద్దగా )
మొదటి వాడు :- ( వీడేంటి ఆ పాట పాడుతున్నాడు అంటే వాడికి అభిమాని అన్న మాట అంటే వీడు ఖచ్చితంగా ఆ కులపోడే అయి ఉంటాడు , వేగం ఇంకా తగ్గింది ).
ఇంక లాభం లేదని మొదటి వాడు టీ.వి పెట్టాడు . టీ.వి లో కుంబకోణాల వార్తలు వస్తున్నవి .
మొదటి వాడు :- వీడు చూడు ఎంత మింగాడో దొంగ నా .. అని తిట్టడం మొదలు పెట్టాడు .
రెండవ వాడు :- వీడేనా ఏంటి వాడు ఎంత తినలా .( వీడు అయితే ఆ పార్టీకి చెందినా వాడు అయి ఉంటాడు )
ఇద్దరిలో ఈ విధంగా బాగా యెడ మొహం పెడ మొహం మాటలు చాలా వచ్చాయి . అవీ వీళ్ళకు సంబందించినవి కావు . తిన్నోల్లు బాగానే వున్నారు వీళ్ళ ఇద్దరికీ వచ్చింది . అప్పటికే బాగా వేగం తగ్గింది . ఇంక కొంచెం వేగం తగ్గితే కచ్చితంగా పేలి పోతున్నది . ఇంకా అలా ఇద్దరు తిట్టుకుంటూనే ఉన్నారు . వ్యక్తిగత విమర్శలకు వెళ్లారు . చివరగా వాళ్ల జిల్లా లేవో తెలిసుకున్నారు అంతే అప్పటికే చివరి దశలో ఉన్న రాకెట్ పేలి పోయింది .

song -> actor -> cast -> politics -> area - >Burial Ground

Note :- I am sorry if this hurts any one of you . But this is written truly based on my friends worst experience that too in USA .
.----------------------------------------------------------------------------------------

మీకు ఒక్క నిమిషం సమయం ఉన్నదా !

మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఉన్న ప్రాంతములో తెలుగు వారు ఎంత మంది ఉన్నారు ? అందులో మీ జిల్లా వారు , లేక మీ పట్నం/నగరం వారు, లేక మీ మండలం వారు , లేక మీ గ్రామం వారు అదీ లేకపోతే మీకు ఇష్టమొచ్చిన ప్రాంతం వారు ఎంత మంది ఉన్నారా అని ? మీరు దాని కోసం ఇంక వెతక వలసిన , లేక మీ కీ బోర్డు వాడవలసిన పని లేదు , ఎందుకంటె ఇక్కడ ఒక అద్బుతమైన గ్రాఫ్ ఇవ్వటం జరిగింది . మీరు అంతా మౌస్ తోటే దాన్ని క్లిక్ చేస్తూ అన్ని విషయాలు తెలుసుకో వచ్చు . మీ కోసం మొత్తం మన తెలుగు నాడులో ఉన్న 51,216 గ్రామాలను , 1504 పట్టణాలను/నగరాలను , 1213 మండలాలను మరియు 23 జిల్లాలను ఇవ్వటం జరిగింది . మీ ఇష్టమొచ్చిన ప్రాంతం ఎంచుకోండి అద్బుతాలు చూడండి .


అంతే కాకుండా మన తెలుగు వారి కోసం టెక్నికల్ వీడియో ట్యుటోరియల్స్ , పుస్తకాలు , మీ ప్రాంతాన్ని బట్టి ఈ డీల్స్ , ఈ కూపన్స్ , క్లాసిఫైడ్స్ మరియు పిల్లల కోసం పాటలు , కథలు , పెద్దల కోసం ఫోరమ్స్ ఇవ్వటం జరిగింది .

మొత్తం 294 దేశాలు , 4924 రాష్టాలు మరియు 55518 పట్టణాలు మరి మన తెలుగు వారు ఎక్కడెక్కడో , ఎంత ఎంతమందో , ఏ ప్రాంతము వారో ? మొత్తం ఇవ్వటం జరిగింది ( చివరకు ప్రతి చిన్న గ్రామానికి ఒక గ్రాఫ్ , అది కూడా ఆ గ్రామ ప్రజలను దేశాల వారి గ్రాఫ్ ,రాష్టాల వారి గ్రాఫ్ , పట్టణాల వారి గ్రాఫ్ లలో ఇచ్చాము ) మన http://telugukingdom.net లో .

మీకు కూడా ఇదే మా ఆహ్వానం రండి ఆతిద్యాన్ని స్వీకరించండి .
-------------------------------------------------------------------------------------