Sunday, June 27, 2010

నాకు ఇవాళ బాగా తిక్క రేగుతున్నది

నాకు ఇవాళ బాగా తిక్క రేగుతున్నది . మా మేనేజర్ వారం రోజులకి ఒక స్టేటస్ రిపోర్ట్ పంపన్నాడు . ఏమి చేస్తాము పంపక చస్తామా . తొక్కలో వన్ మిలియన్ ప్రాజెక్ట్ కి ప్రతి వారం రిపోర్ట్ . అది సరే అది అలా ఉంటే , మనము పడీ పడీ టాక్స్లు కడతాము కదా , మన లీడర్ లో 5 ఇయర్స్ లో అది పీకుతాము ఇది పీకుతాము అంటారు కదా , అవన్నీ విని ఓ గుద్దేస్తాము కదా , మరి ఆ తరువాత స్టేటస్ రిపోర్ట్ ఎందుకు అడగమో నాకు అర్ధం కావటం లేదు,( లక్షల కోట్ల రూపాయలకు ) . నేనొక పెద్ద వెధవని అందుకే అడగను . మీరు ...

Join http://telugukingdom.net

Thursday, May 20, 2010

నేను ఆంధ్ర వాడినా ?? తెలంగాణా వాడినా ??

ఇప్పటి పరి బాషలో చెప్పాలంటే అమ్మది ఆంధ్ర , నానది తెలంగాణా క్రిందకి వస్తది . కాని మా ఊరులో ఖమ్మం , కృష్ణ రెండు జిల్లాల పవర్ వాడతారు .నానది తెలంగాణా అని నన్ను తెలంగాణా అనుకుంటే మా నాన నానది ఆంద్ర . మరి అంతకు ముందా నాకు తెలియదు . అసలు సంగతి ఏంటంటే నన్ను నా ఆంధ్ర స్నేహితులు నువ్వు తెలంగాణా వాడివిరా అంటారు . మరి నా తెలంగాణా స్నేహితులు ఊరుకుంటారా ఆహా లేదే , నువ్వు అటువాడివే అంటారు .

అందుకే ఇద్దరకి చెప్పేది ఏంటంటే

నేను ఆంధ్ర వాడిని కాదు
తెలంగాణా వాడిని కాదు .
...............................
మరి....... అసలు సిసలు తెలుగు వాడిని .
గర్వంగా ,సగర్వంగా , మీసం మెలి వేసి , తొడ కొట్టి , చిందేసి , కేకేసి ,రంకేసి చెపుతున్న అవును నేను 100 శాతం తెలుగు వాడిని .

అందుకే నా ఈ తెలుగు రాజ్యం . నా రాజ్యం లో అందరు మంచి వారే .

ఇట్లు
తెలుగు పౌరుడు

తెలుగు రాక్ పాట - హే హూ ఆర్ యు మ్యాన్